న్యూస్‌రీల్
నామినేషన్లు వేయకుండా అభ్యర్థులకు అడ్డంకులు పోటీకి దిగితే అంతు చూస్తామంటూ హెచ్చరికలు ఉప్పూడిలో నామినేషన్ పత్రాల చించివేత ఎమ్మెల్యే సోదరుడిపై ఆరోపణలు పెద్దమట్లపూడిలో కర్రలతో అడ్డుకున్న కూటమి నేతలు రేపల్లె నియోజకవర్గంలో పది పంచాయతీలు ఏకగ్రీవం
బాపట్ల
బుధవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2026
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రేపల్లె నియోజకవర్గంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఏకగ్రీవాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థులకు బెదిరించడంతోపాటు అడ్డంకులు సృష్టించారనే ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో ముందుకొచ్చిన అభ్యర్థులను కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కూటమి నాయకుల ఒత్తిళ్లు, హెచ్చరికల కారణంగానే పలువురు పోటీ నుంచి వెనక్కి తగ్గారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
విచారణ జరపాలి
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 26.4470 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
రేపల్లె: నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో పది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు సమాచారం. వీటిలో రేపల్లె మండలంలో మూడు, నిజాంపట్నం మండలంలో నాలుగు, నగరం మండలంలో మూడు పంచాయతీలు ఉన్నాయి. అయితే, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని లేకుండా చేసి సాధించిన ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి ఎంతవరకు అద్దం పడుతున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో నమోదైన ఏకగ్రీవాల వెనుక స్వచ్ఛంద నిర్ణయాలున్నాయా? లేక బెదిరింపుల ప్రభావం ఉందా? అనే చర్చ మొదలైంది.
ఉప్పూడిలో నామినేషన్ పత్రాల చించివేత
రేపల్లె మండలం ఉప్పూడిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు అడ్డంకులు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నామినేషన్ పత్రాలను చించివేయడంతోపాటు, మాజీ సర్పంచ్, ఎమ్మెల్యే సోదరుడు రంగంలోకి దిగారని తెలిసింది. పోటీకి దిగితే అంతు చూస్తామంటూ హెచ్చరించినట్లు వైఎస్సార్ సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామాలతో పోటీకి సిద్ధమైన కొందరు అభ్యర్థులు వెనుకడుగు వేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
పెద్దమట్లపూడిలో కర్రలతో అడ్డగింత
నగరం మండలం పెద్దమట్లపూడిలో నామినేషన్ల కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కర్రలతో అక్కడికి చేరుకున్న కూటమి నాయకులు, పోటీకి సిద్ధమైన అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరికొన్ని గ్రామాల్లోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.
నిజాంపట్నంలో అడ్డంకులు
నిజాంపట్నం మండలంలోని ప్రజ్ఞం, కూచినపూడి తదితర గ్రామ పంచాయతీల్లోనూ నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఎదురైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వారిని ముందుగానే హెచ్చరించి, నామినేషన్ కేంద్రాలకు రాకుండా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఏకగ్రీవాల ప్రక్రియపై అనుమానాలకు తావిస్తున్నాయి.
చెరుకుపల్లిలో వ్యాపారులకు...
చెరుకుపల్లి మండలంలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొందరు వ్యక్తులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు వారిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘మమ్మల్ని కాదని నామినేషన్లు వేస్తే.. నువ్వు ఎలా వ్యాపారం చేసుకుంటావో చూస్తాం’ అంటూ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో రాజకీయంగా ఎదుర్కొనే పరిస్థితి లేక, జీవనోపాధికి ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోనన్న భయంతో కొందరు పోటీ నుంచి తప్పుకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన సమయంలో అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్ పత్రాలను చించి చేయడం, పోటీకి అడ్డంకులు సృష్టించడం వంటి ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామస్థులకు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం కల్పించాల్సింది పోయి, భయపెట్టి ఏకగ్రీవాలు సాధిస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలపై ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలనే డిమాండ్‌లు వస్తున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.


