నాదెండ్ల: గణపవరం గ్రామంలోని పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేట అగ్నిమాపకదళ అధికారి అన్వేష్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న సాంబశివ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మంగళవారం రాత్రి యంత్రాల్లో రాళ్లు పడి నిప్పురవ్వలు రాజుకుని పత్తిపై పడటంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కంపెనీలో కొన్నేళ్లుగా సర్జికల్ కాటన్, ఇయర్ బడ్స్, దీపారాధన ఒత్తులు తయారు చేస్తుంటారు. మంగళవారం రాత్రి నైట్ షిప్ట్‌లో రాత్రి 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యంత్రాలతో సహా ముడిపదార్థం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట ఫైర్ ఇంజిన్‌తోపాటూ మరో నాలుగు ఇతర ప్రాంతాల ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆ సమయంలో యజమాని పెంటేల సత్యనారాయణ ఇతర ప్రాంతంలో ఉండటంతో బుధవారం రాత్రి ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని గురువారం ఉదయం అగ్నిమాపక దళ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.60 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు.
నగరంపాలెం: స్థానిక రింగ్‌రోడ్డు సిద్ధార్థ కన్వెన్షన్ సెంటర్‌లో నేషనల్ సిల్క్ ఎక్స్‌పో ప్రారంభమైంది. ఎక్స్‌పో ఈనెల 19 వరకు కొనసాగనుంది. దేశంలోని పలు రాష్ట్రాల చేనేత కళాకారులు, నేత కార్మికుల ప్రత్యేక వస్త్ర సంపద ఒకే వేదికపై విభిన్న ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాల అనుబంధా న్ని ప్రదర్శించారు. నేత కార్మికులు రూపొందించిన పట్టు, కాటన్ వస్త్రాలు, సరికొత్త డిజైన్ల చీరలు, డిజైనర్ చీరలు, బ్లౌజులు, కుర్తీలు, వేలాది రకాల వస్త్రాలు అందుబా టులో ఉన్నాయి. వస్త్రాలపై యాభై శాతం తగ్గింపు ఽకొనుగోళ్లను ప్రవేశపెట్టా రు. పైఠానీ పట్టు చీరలు (కర్ణాటక), సాఫ్ట్‌సిల్క్ వస్త్రాలు, చందేరి, మహేశ్వరి పట్టు చీరలు (మధ్యప్రదేశ్), డిజైన్ చీరలు, బాలుచరి, జమ్దానీ, టాంగైల్, ఢాకాయ్ మస్లిన్ సిల్క్, లినెన్ చీరలు, కాంతావర్క్ ఎంబ్రాయిడరీ వస్త్రాలు (పశ్చిమ బెంగాల్), టస్సర్ సిల్క్, మట్కా సిల్క్, భాగల్‌పూర్ పట్టు వస్త్రాలు(బీహార్), బాంధినీ, కచ్ ఎంబ్రాయిడరీ, పటోలా చీరలు (గుజరాత్), కాంచీపురం పట్టు చీరలు (తమిళనాడు), ఎంబ్రాయిడరీ పట్టు వస్త్రాలు, టాబీ సిల్క్ చీరల (జమ్ము కశ్మీర్)లు ఉన్నాయని నిర్వాహ కులు తెలిపారు. విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన డిజైన్ చీరలు, దుప్పట్లు, సల్వార్ మెటీరియల్స్, బనారసీ పట్టు చీరలు, జమ్దానీ, షిఫాన్ చీరలు ఉన్నట్లు చెప్పారు. దసరా పండుగ, వివాహ వేడుకలకై ప్రత్యేకమైన దుస్తులను కొనుగోలుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితమని అన్నారు.
కొరిటెపాడు(గుంటూరు): పత్తి జిన్నింగ్ పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ, టీఎంసీ యూనిట్ల పరిరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాటన్ టీఎంసీ కన్సార్టియం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ కాటన్ టీఎంసీ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ కాటన్ టీఎంసీ కన్సార్టియం కార్యవర్గం, సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.


