అదే దౌర్జన్యకాండ | - | Sakshi
Sakshi News home page

అదే దౌర్జన్యకాండ

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

శుక్రవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 అదే దౌర్జన్యకాండ పులిచింతల సమాచారం ● ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు యేమినని రాంబాబు, కొక్కిలిగడ్డ రవి నామినేషన్లు దాఖలు చేసేందుకు నిజాంపట్నం మండల పరిషత్‌ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు సోదరుడు మోపిదేవి హరినాథ్‌బాబు, ఆయన అనుచరులు వారిని అడ్డుకున్నారు. ఏకంగా నామినేషన్‌ పత్రాలను చించివేశారు. ఈ క్రమంలో దాడి జరగడంతో కొందరు గాయపడ్డారు. ● నిజాంపట్నంకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు చిప్పల సాయిబాబాకు సంబంధించిన ఇంట్లో బుధవారం రాత్రి ఫర్నిచర్‌, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. సాయిబాబా ఇంట్లో లేని సమయంలో లోనికి ప్రవేశించిన వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

న్యూస్‌రీల్‌

వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల చించివేత పార్టీ నాయకుడి ఇంట్లో ఫర్నిచర్‌, ఇతర వస్తువులు ధ్వంసం అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రేణుల డిమాండ్‌

బాపట్ల
శుక్రవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.8716 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

రేపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల వేళ నిజాంపట్నంలో చోటుచేసుకున్న వరుస ఘటనలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేయడంతోపాటు వారిపై దాడులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. మరోవైపు బుధవారం అర్ధరాత్రి వైఎస్సార్‌ సీపీ నాయకుడు చిప్పల సాయిబాబాకు చెందిన ఇంట్లో ఫర్నిచర్‌, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. వరుస ఘటనలతో నిజాంపట్నంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కూటమి అరాచకాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

దాడుల పర్వం

ఓటమి భయంతోనే?

ఒకవైపు నామినేషన్‌ పత్రాల చించివేత, మరోవైపు ఇంట్లో వస్తువుల ధ్వంసం ఘటనలతో నిజాంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితులు కల్పించడం, శాంతిభద్రతలను కాపాడటం అధికారుల కీలక బాధ్యతలు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికంతటికీ ఓటమి భయమే కారణమని వైఎస్సార్‌ సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలలో పోటీ అనేది అర్హుడైన ప్రతి అభ్యర్థికి ఉన్న హక్కు. అలాంటి హక్కుకు భంగం కలిగించే ఘటనలు చోటుచేసుకుంటే అధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఇకనైనా ఎన్నికల అధికారులు, పోలీసులు పూర్తి వివరాలు సేకరించి బాధ్యులను గుర్తించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

స్థానిక ఎన్నికల వేళ టీడీపీ నేతల అరాచకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement