ఏఎన్‌యూ దూరవిద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ దూరవిద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

ఏఎన్‌యూ దూరవిద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ (పెదకాకాని): ఏఎన్‌యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన ఈ పరీక్ష నిర్వహించిన సంగతి విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 14 కేంద్రాలలో జరిగిన పరీక్షలో ఎంబీఏకు 684 మంది, ఎంసీఏకు 97 మంది అర్హత సాధించారని దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్‌ ఆచార్య దిట్టకవి రామచంద్రన్‌లు తెలిపారు. ప్రవేశాలు పొందేందుకు సెప్టెంబరు 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఏపీ ఐసెట్‌ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా అడ్మిషన్లు పొందవచ్చన్నారు. వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య ఆర్‌. శివరాం ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య జి. సింహాచలం, దూరవిద్య కేంద్రం పరీక్షల విభాగం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కృష్ణవేణి, సూపరింటెండెంట్‌ జవ్వాజి శ్రీనివాసరావు, ఐసీటీ డివిజన్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement