ఇదేమి కర్మ ‘బాబూ’..! | - | Sakshi
Sakshi News home page

ఇదేమి కర్మ ‘బాబూ’..!

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

పట్నం బజారు: ప్రతి సారీ ఇదే ఇబ్బంది.. సీఎం చంద్రబాబు పర్యటన అంటేనే ప్రయాణికులు ముప్పతిప్పలు పడాల్సి వస్తోంది.. అసలే అంతంతమాత్రంగా ఉంటున్న ఆర్టీసీ బస్సులు.. దీనికి తగ్గట్లు ఎడతెరిపి లేనివర్షం.. దీంతో ప్రయాణికులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. సాధారణ ప్రయాణీకులకు సీఎం సభలు అంటే శాపంగా మారుతోంది. బుధవారం తుళ్లూరు సమీపంలోని అబ్బురాజువారిపాలెంలో జరిగిన ఓ కంటి ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు రీజియన్‌ పరిధిలోని గుంటూరు డిపో–1, డిపో–2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల నుంచి సుమారు 70 ఆర్టీసీ బస్సులను తరలించినట్లు సమాచారం.

బస్సుల కోసం పడిగాపులు..

ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులను కార్యక్రమానికి తరలించడంతో సాధారణ సర్వీసుల సంఖ్య తగ్గిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, కూలీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు నిత్యం ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడే వారు, గంటల కొద్ది బస్సుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తగ్గట్లు ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆర్టీసీ బస్టాండ్‌ కనీసం నిల్చునేందుకు కూడా ఖాళీ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సివచ్చింది. ‘సీఎం కార్యక్రమం ఎక్కడ జరిగినా బస్సులను తరలిస్తారని కార్యక్రమం ఒకచోట జరుగుతుంటే ఇబ్బందులు మాత్రం మాకు ఎందుకంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

● భారీ సంఖ్యలో బస్సులను కార్యక్రమానికి తరలించినప్పటికీ, దీనిపై సంబంధిత ఆర్టీసీ అధికారుల నుంచి అధికారిక వివరణ అందలేదు. ఎన్ని బస్సులను ఏ ప్రాతిపదికన కేటాయించారు? సాధారణ సర్వీసులపై ప్రభావం పడుతుందని ముందుగానే గుర్తించారా? ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నలకు అధికారులు ఇప్పటివరకు స్పష్టత కూడా ఇవ్వలేదు.

సీఎం కార్యక్రమానికి బస్సులు.. జనాలకు తిప్పలు

అబ్బురాజుపాలెం సీఎం కార్యక్రమానికి గుంటూరు రీజియన్‌ పరిధి నుంచి 70 బస్సుల వరకు కేటాయింపు

బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement