గుంటూరు రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఏటుకూరులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏటుకూరు గ్రామం శ్రీగణేష్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సర్వీసు రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి వయస్సు 36 సంవత్సరాలు ఉంటాయి, తెల్లని చొక్క ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు నల్లపాడు పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.


