పరిశ్రమల అభివృద్ధిలో వెనుకంజ | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల అభివృద్ధిలో వెనుకంజ

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

పరిశ్రమల అభివృద్ధిలో వెనుకంజ ● వీబీజీ రామ్‌ జీ పథకం కింద కరువు పనులు పెంచాలని ఎమ్మెల్సీ పోతుల సునీత కోరారు. నిరుపేదలకు ఉపాధి అవకాశం మరింతగా పెంచి ఉపాధి చూపాలన్నారు. అలాగే ఈ పథకాన్ని రైతులకు అనుసంధానించాలన్నారు. ● కరువు మండలాల గుర్తింపులో వేమూరు నియోజకవర్గాన్ని చేర్చాలని వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు కోరారు. రైతులకు సాధారణంగా సరఫరా చేసే యూరియా అదనంగా ఒక బస్తా ఇవ్వాలని కోరారు. ● ఇప్పటివరకు వేసిన పంటలు కాపాడుకునేలా నీరు విడుదల చేయాలని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు కోరారు. రైతులకు న్యాయం చేయాలని విన్నవించారు. ● చీరాలలో దెబ్బతిన్న ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని చీరాల శాసనసభ్యుడు ఎం ఎం కొండయ్య మంత్రిని కోరారు. ఏపీఎస్‌ఐడీసీ కార్యాలయం ఒంగోలుకు తరలి వెళ్లిందని, చీరాలలో పర్యవేక్షణకు అధికారులను నియమించాలన్నారు. చేనేత పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నీటిపై నివేదిక ప్రభుత్వానికి పంపాలి

అధికారులు తీరు మార్చుకోకుంటే కష్టం జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్ధసారథి తల్లికి వందనం లబ్ధిదారులకు అన్యాయంపై మండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావు ఆగ్రహం నీళ్లు నమిలిన పాలకవర్గం

ఆదాయం పెంపు గణనీయంగా ఉంది

తల్లికి వందనం లబ్ధిదారులకు అన్యాయం

బాపట్ల: పరిశ్రమల అభివృద్ధి విషయంలో బాపట్ల జిల్లా వెనుకంజలో ఉండటం బాధాకరమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల ప్రగతిలో జీరోగా ఉండటం సరైన పద్ధతి కాదని, అధికారులు పనితీరుమార్చుకోకుంటే కష్టమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్‌లో జరిగింది. ఈసమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరురాకుండా చూడాలని ఆయన సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనుషులు, జీవాలకు తాగునీరు కొదువ లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు.

ప్రస్తుతం రైతులు సాగుచేసిన పంటలను కాపాడుకోవడానికి ఎంత నీరు కావాలి అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. జల వనరుల లభ్యత, అవసరతపై స్పష్టంగా పొందుపరిచి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. 60 రోజుల పాటు నీరు విడుదలైతే జల వనరులశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పర్యవేక్షణ లోపంతోనే తాగునీటి చెరువులు పూర్తిగా నిండా లేదన్నారు. దిగువకు రాకుండానే నీటి చౌర్యం జరుగుతుంటే పట్టించుకోలేదన్నారు. అవసరమైతే పోలీసులు సహకారం తీసుకోవాలని, పోలీసుల భద్రతతో ట్యాంకులు నిండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆక్వా, పర్యాటక, రియల్‌ ఎస్టేట్‌ రంగాలతో బాపట్ల జిల్లా ఆదాయం గణనీయంగా పెరిగిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ప్రకటించారు. రూ.2,127 కోట్లు ఆదాయంతో రాష్ట్రంలోనే గత ఏడాది 11వ స్థానంలో ఉన్న బాపట్ల జిల్లా ఇప్పుడు రూ.2,200 కోట్లు ఆదాయంతో 8వ స్థానానికి చేరినట్లు ప్రకటించారు. వృద్ధిరేటు పెరగడం వ్యవసాయ, ఆక్వా అనుబంధ రంగాలు, పర్యాటక ప్రాంత అభివద్ధి కార్యక్రమాలతో భూముల విలువ పెరిగి రియల్‌ ఎస్టేట్‌ ద్వారా ఆదాయం మరింతగా పెరిగిం దన్నారు.

తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారులైన విద్యార్థులందరికీ నగదు విడుదలయ్యేలా అధికారుల చర్యలు తీసుకోవాలని శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ తూమాటి మాధవరావు అగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది 9450 మందికి తల్లికి వందనం ఇవ్వకపోగా ఈ ఏడాది మరో పదివేల మందికి లబ్ధి చేకూరలేదన్నారు. జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయినప్పటికీ ఇంత వరకు గౌరవవేతనం విడుదల చేయకపోవటం బాధాకరమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement