జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభం
బాపట్లటౌన్: కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్ యూనిట్ కీలకమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ నేర దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాల సేకరణను మరింత బలోపేతం చేయడం, నేరస్థలానికి ఫోరెన్సిక్ సేవలను వేగంగా చేరువ చేయడంలో భాగంగా బాపట్ల జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనం అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు.
వాహనంలో ఉన్న అధునాతన పరికరాలను పరిశీలించి, వాటిని ఏఏ సందర్భాల్లో ఏవిధంగా వినియోగిస్తారనే వివరాలను క్లూస్ టీం ఎస్‌ఐ, సిబ్బంది ఎస్పీకు క్షుణ్ణంగా వివరించారు. ఈ వాహనంలో 250 కి పైగా అత్యాధునిక పరికరాలు ఉన్నాయన్నారు. మూడు స్థాయిలతో కూడిన 24/7 ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కలెక్షన్ వ్యవస్థను రూపొందించారన్నారు. ఈ వాహనాల ఏర్పాటుతో శాసీ్త్రయ దర్యాప్తు వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ నిపుణుల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందన్నారు. అడిషనల్ ఎస్పీ ఎల్.సుధాకర్, బాపట్ల డీఎస్పీ సిహెచ్ చంద్రమౌళి, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఏఆర్ డీఎస్పీ పి.కృష్ణంరాజు, ఆర్‌ఐలు, సీఐలు, క్లూస్ టీం ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.


