జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ కన్నా భూశంకర్రావు
బాపట్లటౌన్: తీరప్రాంత పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా ప్రెసిడెంట్ కన్నా భూ శంకర్రావు తెలిపారు. సూర్యలంక తీరంలో శనివారం జరగనున్న స్వచ్ఛ సాగర్..సురక్షిత సాగర్ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం సూర్యలంక బీచ్ వద్ద తలపెట్టిన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. భూమండలం చుట్టూ మన కోసం కలిగి ఉన్న ముఖ్యమైన వనరులు సముద్రం ఒకటి. కాలుష్యం నుంచి కోట్లాది జల జీవరాశులను కాపాడేందుకు దానిని శుభ్రంగా ఉంచడానికి అందరం కలిసి పని చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు ఉద్యోగస్తులు పాల్గొని పర్యావరణాన్ని కాపాడాలని, సముద్ర జీవుల సంరక్షణకు తోడ్పడాలని మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా సెక్రెటరీ కోకిలగడ్డ చంద్రబాబు, జిల్లా ఇన్‌చార్జి మోపిదేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


