వాట్సాప్‌ స్టేటస్‌పై వివాదం | - | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ స్టేటస్‌పై వివాదం

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

రేపల్లె: రేపల్లె పట్టణంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని 21వ వార్డుకు చెందిన ఓ యువకుడు అమీద్‌ తన మొబైల్‌ ఫోన్‌ వాట్సాప్‌ స్టేటస్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్‌న్‌మోహన్‌రెడ్డి ఫొటోను ఉంచినందుకు అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకులు అతనిపై దాడికి దిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడిలో యువకుడు అమీద్‌ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు కరిముల్లా, గౌసియా దాడి ఎందుకు చేశారని ప్రశ్నించేందుకు వెళ్లగా వారిపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ముగ్గురిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌ సీపీ నేతలు చిత్రాల ఓబేదు, చిమట బాలాజీ, కరేటి శేషగిరిరావు, కృష్ణారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నాగలక్ష్మి, వార్డు ఇన్‌న్‌చార్జి ఖాదర్‌ తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి అండగా నిలిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement