బాపట్లటౌన్: పేదల ఆరోగ్యం కోసం పరితపించే మాపై కనికరం చూపండంటూ ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు. శుక్రవారం భోజన విరామ సమయంలో ఏరియా వైద్యశాలలో ప్రతిజ్ఞచేస్తూ నిరసన తెలియజేశారు. సత్యంరాజు మాట్లాడుతూ సేవ చేయడంలో వెనకడుగు వేయం మా విన్నపాలను కనికరించి మన్నించండంటూ ప్రాధేయపడ్డారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేవ చేయడానికి వెనకడుగు వేయబోమని, విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం మేము ముందుంటాంం మా జీవితాల కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఖాళీ కడుపులతోనైనా విధులకు వస్తాం కానీ మా విన్నపాలు ఖాళీగా మిగలకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సు అనూష, ఫార్మాసిస్టులు నళిని కుమారి, శాంతి, మనోజ, సుధా కుమారి, బయో మెడికల్ ఇంజనీర్ నళిని కుమారి, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనిల్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు బహటం నీలిమ పాల్గొన్నారు.
గణనాథుడికి కలెక్టర్‌ప్రత్యేక పూజలు
Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM
గణనాథుడికి కలెక్టర్‌ప్రత్యేక పూజలు
బాపట్ల బాపట్ల పట్టణంలోని పటేల్‌నగర్ పోస్టాఫీస్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ శుక్రవారం సందర్శించారు. గణనాథుడికి కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. నిర్వహకులు కత్తి రామకృష్ణ, శంకర్‌నాయుడు కలెక్టర్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. 21న డీఎస్సీ అక్రమాలపై విజయవాడలో నిరసన రేపల్లె: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో జిల్లాలోని క్రిస్టియన్ మైనార్టీ విభాగం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ బాపట్లజిల్లా అధ్యక్షుడు సముద్రాల ప్రభుకిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తుందన్నారు. ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన
Advertisement


