పేదల గుండెల్లో వైఎస్సార్‌ పదిలం | - | Sakshi
Sakshi News home page

పేదల గుండెల్లో వైఎస్సార్‌ పదిలం

Sep 3 2026 4:21 AM | Updated on Sep 3 2026 4:21 AM

● మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ తో అందరికీ ఉచిత వైద్యం అందించిన ఆపద్బాంధవుడు, అన్నదాతలకు ఉచిత విద్యుత్తు నిచ్చిన రైతు బాంధవుడు, జలయజ్ఞంతో వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపించిన అపర భగీరథుడు వైఎస్సార్‌ అని కొనియాడారు. ● ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందుబాటులోకి తెచ్చిన విద్యాదాతగా, 108 అంబులెన్సులు, పెన్షన్‌ పెంపు, తెల్ల రేషన్‌ కార్డులు, నిరుపేదలకు ఇల్లు అందించిన నిజమైన ప్రజా నాయకుడుగా అభివర్ణించారు. ● గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్సార్‌ అనే మూడు అక్షరాల పేరు కాదని రెండు రాష్ట్రాల ప్రజల గుండె చప్పుడని కీర్తించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుదర్శన్‌ రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ఒట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, రోళ్ల మాధవి, కొమ్మసాని శ్రీనివాసరెడ్డి, లీగల్‌ సెల్‌ జోన్‌–3 స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోలూరి వెంకటరెడ్డి, రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి మణిబాబు, లీగల్‌ సెల్‌ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మొండితోక శ్రీనివాసరావు, టౌన్‌ ప్రెసిడెంట్‌ లీగల్‌ సెల్‌ కొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల లీగల్‌ సెల్‌ అధ్యక్షులు ఎస్కే షన్ను, నల్లక వెంకట వేణు, బార్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రేవతి, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి, మాజీ ఏపీపీలు కళ్ళం రమణారెడ్డి, మాతంగి శ్రీకాంత్‌, బండి మంజుల, వజ్రాల రాజశేఖర్‌ రెడ్డి, శ్యామల, ఎస్‌బీఏ ఝాన్సీ, ఇందిరా, మాజీ జీపీలు పోకల వెంకటేశ్వర్లు, మారెళ్ళ సుబ్బారెడ్డి.ఎరుకల రెడ్డి, ఎంవీ సుబ్బారెడ్డి, కోటి లింగారెడ్డి, బాబురావు బట్టగిరి వెంకటరమణ, సుదర్శన్‌, క్రాంతి కుమార్‌ చల్లా, శ్రీనివాస్‌ రెడ్డి వేముల ప్రసాదు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో మహానేత వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల, న్యాయవాదులు

గుంటూరు ఎడ్యుకేషన్‌/గుంటూరు లీగల్‌: పేదల కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన పాలకుడని మనసా వాచా కర్మణా విశ్వసించిన మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ జనం గుండెల్లో సంక్షేమ శ్రామికుడిగా నిలిచారని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టులో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభ జరిగింది. ఈసందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు వినగలిగితే చాలు, నా జన్మ ధన్యమైనట్టే అని భావించి, ఆ దిశగా ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి, తన సంక్షేమ సంతకంతో చెరిగిపోని జ్ఞాపకం మిగిల్చిన మరణం లేని మహానాయకుడిగా డాక్టర్‌ వైఎస్సార్‌ నిలిచారని కొనియాడారు. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో సరికొత్త సంక్షేమ అధ్యాయాన్ని లిఖించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని తెలిపారు. అందుకే సంక్షేమ పాలన గురించి ఎక్కడ ప్రస్తావించాల్సి వచ్చినా వైఎస్సార్‌కు ముందు, ఆ తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులతో ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్సార్‌ ఆశయ సాధనకై మేము సైతం అంటూ జగనన్న అడుగులో అడుగేస్తామని ప్రతినబూనడం ద్వారా ప్రతి ఒక్కరూ రాజన్నకు నిజమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement