పర్చూరు(చినగంజాం): గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించే విషయంలో ప్రభుత్వ స్పందన సక్రమంగా లేదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ కృష్ణయ్య అన్నారు. గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ పర్చూరులో 10 రోజులుగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ కృష్ణయ్య మద్దతు తెలిపారు. రైతుల నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పర్చూరు ప్రాంత చిరకాల వాంఛ గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని, అది నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వ స్పందన సక్రమంగా లేదన్నారు. నందిపాడు వరకు వచ్చిన చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని, అందుకు రూ.10 కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. అంత తక్కువ మొత్తాన్ని రైతుల కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం తాత్సారం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు ఈ ప్రాంతంలోని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పర్చూరు వరకు ఛానల్ పొడిగించడానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగించాలని అందుకు తమ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం అన్ని దశల్లో పోరాటానికి అండదండలు ఇస్తుందని తెలిపారు.
పర్చూరులో 11వ రోజు కొనసాగిన రైతుల నిరాహార దీక్ష
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించే విషయమై 10 రోజులుగా సాగుతున్న రైతులు నిరాహార దీక్ష బుధవారం 11 వ రోజు కూడా కొనసాగింది. మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన 10 మంది రైతులు నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. బుధవారం నాటి దీక్షలో డాక్టర్ కొల్లా రాజమోహనరావు, చెన్నుపాటి సూర్య ప్రకాశరావు, చెన్నుపాటి రాధాకృష్ణ, చాగంటి కృష్ణ, గోరంట్ల సీతారామాంజనేయులు, గోరంట్ల రంగారావు, బండి రాంబాబు, చెన్నుపాటి రామ్మోహనరావు, నాయుడు సుబ్బారావు, బండి శంకరయ్య, గోరంట్ల అరవింద్ కూర్చొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు వీ కృష్ణయ్య నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్షకు తమ పూర్తి మద్దతును తెలియజేసి రైతులకు అండగా నిలిచారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి హనుమంతరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీ కొండయ్య, రైతు సంఘం నాయకులు బండి శంకరయ్య, కొమ్మినేని శ్రీనివాసరావు, డేవిడ్, శ్రీనివాసరెడ్డి, అంచా సుబ్బారావు, కృష్ణంశెట్టి రామకోటేశ్వరరావు, మన్నే మురహరి, మువ్వల రాంబాబు, ఒగ్గిశెట్టి గోవిందరాజులు, పేర్ని హరిబాబు, లగడపాటి వీరాంజనేయులు, దేవరపు లక్ష్మీనారాయణ, లంకా శివ, కోట శ్రీనివాసరావు, తులసి శివనాగేశ్వరరావు, తోకల కృష్ణమోహన్, మల్లాది హనుమంతరావు, తులసి శ్రీనివాసరావు, గోరంట్ల భాస్కరరావు, దొడ్డా వెంకట్రావు, రావూరి ప్రసాద్, గోగుల పూర్ణచంద్రరావు, లంకా రాఘవులు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ కృష్ణయ్య


