మేధోశక్తిని పెంచేందుకే చెకుముకి పోటీలు | - | Sakshi
Sakshi News home page

మేధోశక్తిని పెంచేందుకే చెకుముకి పోటీలు

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

మేధోశక్తిని పెంచేందుకే చెకుముకి పోటీలు ఉపాధ్యాయులకు టెట్‌పై పునఃసమీక్షించాలి

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు

కోట వెంకటేశ్వరరెడ్డి

బాపట్లటౌన్‌: విద్యార్థుల్లో దాగివున్న మేధోశక్తిని పెంపొందించేందుకే చెకుముకి పోటీలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మండలంలోని వెదుళ్లపల్లి చైతన్యభవన్‌లో బుధవారం చెకుముకి పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మొదటిదశ ఈనెల 27న జరుగుతున్నాయన్నారు. రెండో దశ సెప్టెంబర్‌ 11 జిల్లా స్థాయిలో, మూడో దశ పోటీలు నవంబర్‌ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరుగుతాయన్నారు. నేటి ఆధునిక సమాజంలో మానవుల జీవితమంతా సైన్సు ఆధారంగానే నడుస్తుందన్నారు. అయితే చాలా విషయాల్లో సైనన్స్‌కు భిన్నంగా ప్రజల ఆలోచన విధానం వెనకబడి ఉందన్నారు. జనవిజ్ఞాన వేదిక గత నాలుగు దశాబ్దాలుగా రకరకాల విభిన్నమైన కార్యక్రమాలతో ప్రజల్లో శాసీ్త్రయ ఆలోచన పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు చిన్ననాటి నుండి శాసీ్త్రయ ఆలోచన పెంపొందించుటకు గత 38 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల మంది హైస్కూల్‌ స్థాయి 8, 9,10 తరగతుల్లోని విద్యార్థులకు ఈ చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, జిల్లా జన విజ్ఞాన వేదిక నాయకులు కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు విడుదల చేసిన టెట్‌ పరీక్ష నోటిఫికేషన్‌ను ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఏఐఎస్‌టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌బాబు కోరారు. రామిరెడ్డిపేటలోని ఎస్‌టీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోసఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ, కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు మేలు చేకూరేలా టెట్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన టెట్‌ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయులకు అనుకూలంగా ఎటువంటి ప్రత్యేకతలు లేవని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడినందున ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని సాకులు చెబుతున్న ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు పరిశీలించాలన్నారు. బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం అర్హత మార్కులు 40 శాతం తగ్గించిందని, తమిళనాడు ప్రభుత్వం 2010 సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్ట్యా కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష రాయటం వారిని మానసిక ఆందోళనకు గురి చేస్తుందన్నారు. వీటన్నీంటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే టెట్‌ నోటిఫికేషన్‌ను మార్చాలని కోరారు. టెట్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, అందరికీ 40 శాతం మార్కులు అర్హతగా పరిగణించాలనీ, సిలబస్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఎస్‌టీయూ నేతలు షేక్‌ కరిముల్లా, ఎ.ఏమండీ, షేక్‌ మహబూబ్‌ సుభానీ, పీవీ భీష్మారావు, టి.ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement