నగరంపాలెం: నగరంలోని లక్ష్మీపురం మూడో లైన్‌న్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వస్త్ర దుకాణాన్ని బుధవారం పరిపూర్ణానంద స్వామీజీ ప్రారంభించారు. సినిమా నటి కుమారి ఐశ్వర్య రాజేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ యజమానులు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్ మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు అత్యుత్తమైన, నాణ్యతతో కూడిన పట్టు వస్త్రాలు, సంప్రదాయ చీరలు, ఆధునిక డిజైన్లతో కూడిన వస్త్ర కలెక్షన్‌ను అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వినియోగదారుడికి నాణ్యత, విశ్వసనీయత, ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులోనూ గుంటూరు ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలు అందించాలని కోరారు. ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్‌అహ్మద్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర(నాని) పాల్గొన్నారు.
తెనాలిరూరల్: యువకుడిపై బీరు సీసాతో దాడి చేసి గాయపర్చిన ఘటన తెనాలి చెంచుపేటలో జరిగింది. వినాయక చవితి చందాలు వసూలు చేసే విషయంలో వివాదం జరగగా ఓ యువకుడు మరో యువకుడిపై బీరు సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయర్చాడని సమాచారం. బాధితుడు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు. సమాచారం రావడంతో విచారిస్తున్నారు.


