న్యూస్‌రీల్
గుంటూరు జిల్లాలో ఇలా..
పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు మండలంలోని మన్నవ గ్రామంలో చెరువు అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలు చేపడుతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ములుకుదురు వాగు గట్టు, పెదపాలెంలో మట్టి మాఫియా యథేచ్ఛగా మట్టి తవ్వకాలకు పాల్పడుతోంది.
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండలం అన్నవరం, ఉప్పలపాడు, రాజుపాలెం, నాగులపాడు, పెదనందిపాడు, అన్నపర్రు గ్రామాల్లో ఇష్టానుసారంగా నల్లమడను చెరబట్టి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వైనంపై గత నెల 28వ తేదీన ‘సాక్షి’లో ‘నల్లమల చెరమట్టి’ అనే కథనం ప్రచురించడంతో తాత్కాలికంగా మట్టి తవ్వకాలు నిలిచిపోయినట్లు సమాచారం.
రాజధానిలో మట్టిని మింగేస్తున్న టీడీపీ నాయకులు రిజర్వాయర్ల పేరుతో అడ్డగోలుగా తవ్వి అమ్మకాలు ఇప్పటికే రూ. 50 కోట్ల వరకు తమ్ముళ్ల జేబుల్లోకి అక్రమార్జన యథేచ్ఛగా చెరువులు, కుంటలలోనూ తవ్వకాలు గుంటూరు, పల్నాడు జిల్లాలో బరితెగింపు మామూళ్ల మత్తులో మైనింగ్, రెవెన్యూ అధికారులు
గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 28.6763 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతోంది.
విజయపురి సౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 520.50 అడుగులకు చేరింది. ఇది 150.1900 టీఎంసీలకు సమానం.
పొన్నూరు: శ్రీ వీరాంజనేయ స్వామిని మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దుప్పాల వెంకట రమణ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. వారు అందిస్తున్న అండదండలతో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. చెరువులు, కుంటలు, కొండలు అనే తేడా లేకుండా అన్నింటినీ చెరబట్టి రేయింబవళ్లు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రిజర్వాయర్ల పేరుతో మట్టిని తవ్వి భారీ టిప్పర్ల ద్వారా గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు అక్రమ రవాణా చేస్తూ రూ.కోట్లలో అడ్డగోలుగా దండుకుంటున్నారు. ప్రైవేటు భూముల్లో సైతం తవ్వుకుంటామంటూ మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకొని వంద అడుగుల లోతున తవ్వుతూ దందాకు పాల్పడుతున్నారు.


