9 నుంచి జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

9 నుంచి జాతీయ సదస్సు

Mar 7 2026 8:11 AM | Updated on Mar 7 2026 8:11 AM

9 నుంచి జాతీయ సదస్సు

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ రూసా 2.0 సౌజన్యంతో నెక్ట్స్‌ జనరేషన్‌ డ్రగ్‌ డిస్కవరీ లెవరేజింగ్‌ అండ్‌ టూల్స్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫార్మాస్యూటికల్‌ రీసెర్చ్‌ అండ్‌ రెగ్యులేటరీ ఇన్నోవేషన్‌ అనే అంశంపై జాతీయ స్థాయి వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య కె. గంగాధరరావు తెలిపారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో హైబ్రిడ్‌ విధానంలో నిర్వహిస్తారన్నారు. సంబంధిత బ్రోచర్‌ను శుక్రవారం వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధర్‌రావు, రెక్టార్‌ ఆచార్య ఆర్‌. శివరాం ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ జి. సింహాచలం చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫార్మా కళాశాల ప్రిన్సిపాల్‌, కార్యక్రమ కన్వీనర్లు ప్రొఫెసర్‌ కె. తేజ మూర్తి, డాక్టర్‌ షేక్‌ మస్తానమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement