చింతాయపాలెం(కర్లపాలెం): శ్రీలక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్యస్వామి వారి తిరునాళ్లు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. చింతాయపాలెం పంచాయతీ పరిధిలోని తూర్పుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్యస్వామి దేవాలయంలో తిరునాళ్ల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు చేశారు. మండల పరిధిలోని అమ్మవారి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అమ్మవారి విగ్రహాలకు పూలు, పండ్లు సమర్పించి పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు భక్తులను ఆకర్షించాయి. ఆలయం వద్ద జరిగిన కోలాటం భజనలు భక్తులను అలరించాయి.
ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ


