బాపట్లటౌన్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్‌నాయక్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మహిళా పోలీసులతో కలిసి ప్రారంభించారు. సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్‌నాయక్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్ల గురించి అవగాహన కల్పించారు. బాంబ్ డిస్పోజల్ పరికరాలు, పోలీస్ డాగ్స్, డ్రోన్‌న్స్, సాంకేతికత, కమ్యూనికేషన్ విభాగాల్లో ఉపయోగిస్తున్న పరికరాలు, క్లూస్ టీం ఆధారాలు సేకరించడం, ఫింగర్ ప్రింట్స్ సేకరణ విధానంపై క్షుణ్ణంగా వివరించారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారత కోసం జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా సాధికారతను పెంపొందించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించడం, మహిళల గౌరవాన్ని పెంపొందించే చిత్రాలను ప్రదర్శించడం నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో ఓపెన్ హౌస్ నిర్వహించామన్నారు. ఎస్‌బీ సీఐ బి.నారాయణ, అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, బాపట్ల పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్‌నాయక్


