మృత్యువులోనూ వీడని బంధం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Aug 10 2025 5:52 AM | Updated on Aug 10 2025 5:52 AM

మృత్య

మృత్యువులోనూ వీడని బంధం

పెదకాకాని: ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి అత్యక్రియలకు వెళ్లి ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు అరుంధతీనగర్‌కు చెందిన షేక్‌ సాధిక్‌ (21) గడ్డిపాడు సమీపంలోని మహేంద్ర షోరూంలో పని చేస్తున్నాడు. ఈనెల 6న స్నేహితుడు రమణను బైక్‌పై ఎక్కించుకుని గుంటూరు నుంచి తెనాలి వయా నందివెలుగు మీదుగా బయలు దేరారు. మార్గంమద్యంలో తక్కెళ్లపాడు శివారులోకి చేరుకునే సరికి ఎదురుగా వెళుతున్న లారీ షడన్‌ బ్రేక్‌ వేయడంతో దాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న షేక్‌ సాదిక్‌తో పాటు వెనుక కూర్చున్న రమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో షేక్‌ సాధిక్‌(21) పరిస్థితి విషమించి శుక్రవారం మరణించాడు. మరో యువకుడు రమణ పరిస్థితి విషమంగా ఉంది. మృతుని తండ్రి షేక్‌ హన్ను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు..

ప్రేమో, శారీరక ఆకర్షణో తెలియదు గానీ పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని గుంటూరు ఆర్‌టీసీ కాలనీకి చెందిన కొండూరు శివశంకర్‌ నందివెలుగు రోడ్డులో ఉన్న రైల్వే ట్రాక్‌ పైకి చేరుకున్నాడు. సోదరుడికి ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మాట్లాడుతూనే రైలు బండి కింద పడటంతో శరీరం ముక్కలైంది. ఈనెల 6న కుటుంబసభ్యులు శివశంకర్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తెనాలి బయలు దేరారు. మిత్రుడి పోస్టుమార్టం పూర్తయ్యే వరకూ ప్రాణస్నేహితులు షేక్‌ సాధిక్‌, రమణలు అక్కడే గడిపారు. కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికేందుకు మృతదేహం వెంట తెనాలి బయలు దేరారు. ఇంతలోనే లారీ రూపంలో వెంటాడిన మృత్యువు సాధిక్‌ను కబళించింది. మరో మిత్రుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి గాయపడిన ఇద్దరు యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం

మృత్యువులోనూ వీడని బంధం 1
1/1

మృత్యువులోనూ వీడని బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement