
అట్రాసిటీ కేసుపై విచారణ
మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామం ఆర్టీసీ బస్టాండ్‌లో బాత్‌రూమ్‌లు కడిగే మహిళలను సోమవరప్పాడుకు చెందిన గోలి అజయ్ కులంపేరుతో తిట్టాడని, ప్లాస్టిక్ పైపులతో వాతలు పొంగేలా కొట్టాడని గతవారంపోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీనిపై మంగళవారం చీరాల డీఎస్పీ ఎస్‌డీ మోయిన్ బాధితులు ఉండే బస్టాండ్ ఆవరణకు వచ్చి వారిని విచారించారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ మహ్మద్ రఫీ, సిబ్బది ఉన్నారు.
సిమెంట్ దిమ్మెనుఢీకొన్న కారు
మేదరమెట్ల: లారీని తప్పించబోయిన కారు డివైడర్ కోసం ఉంచిన సిమెంట్ దిమ్మెను ఢీకొన్న ఘటన పీ.గుడిపాడు జాతీయరహదారిపై మంగళవారం జరిగింది. అందిన వివరాల మేరకు.. తెనాలి నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న కారు పీ.గుడిపాడు జాతీయ రహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రాంతానికి రాగానే ఆదే దారిలో వెళ్తున్న లారీ కారు పైకి వస్తుందని కారు డ్రైవర్ కారును పక్కకు తిప్పాడు. అదుపు తప్పిన కారు సిమెంట్ దిమ్మెను ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నారు. ఎవరికి గాయాలు కాలేదు.
కాలువలోకి దూసుకెళ్లిన లారీ
చీరాల: జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు లారీ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళిన సంఘటన మంగళవారం జాతీయ రహదారిలోని మన్నం అపార్ట్‌మెంట్ వద్ద జరిగింది. అందిన వివరాల మేరకు పైపుల లోడుతో కోల్‌కతా నుంచి చైన్నె వెళుతున్న హెవీ లారీ అదుపుతప్పింది. ఒక్కసారిగా బోల్తా పడి రహదారి వెంట ఉన్న కాలువలోకి దూసుకెళ్ళింది. అయితే ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతోప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. దూర ప్రాంతం నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
రూ. 1,40,520 నగదు సీజ్
అదుపులో 10 మంది పేకాట జూదరులు
చినగంజాం: మండలంలోని మోటుపల్లి పంచాయతీ పరిధిలోని కుంకుడు చెట్లపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య ఆధ్వర్యంలోని పోలీసులు బృందం పేకాట శిబిరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,40,520 నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శీలం రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సెప్టెంబరు 13న
జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: సెప్టెంబరు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరగనుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఆర్థిక సంస్థలు, బీమా సంస్థల అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్, సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. స్టేక్ హోల్డర్స్, ప్రతినిధులు సహకరించాలన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు, మూడవ అదనపు జిల్లా జడ్జి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు , రెండవ అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్యనారాయణ సూచనలు చేశారు.

అట్రాసిటీ కేసుపై విచారణ

అట్రాసిటీ కేసుపై విచారణ

అట్రాసిటీ కేసుపై విచారణ