
ఉప ఎన్నికల తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
వరికూటి అశోక్‌బాబు
వేమూరు: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం వేమూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరిగిన తీరు చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పని చేస్తుందని తేటతెల్లం అవుతుందన్నారు. టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఎన్నికల ఎజెంట్లను బూత్‌ల్లోకి రాకుండా అడ్డుకున్న తీరును ప్రజలు చూశారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులను ఓట్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారన్నారు. పోలీసులు కొమ్ముకాయడంతో టీడీపీ నేతలు బహిరంగంగా రిగ్గింగ్ పాల్పడ్డారన్నారు. పులివెందులలో బలం లేదని తెలిసీ, చంద్రబాబు రిగ్గింగ్‌లు, బూత్‌ల ఆక్రమణలకు తెరలేపాడన్నారు. ఇప్పటికై నా ఎన్నికల కమిషన్ కలుగజేసుకుని రిగ్గింగ్ జరిగిన బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మెటల్ క్వారీలో కార్మికుడు మృతి
బల్లికురవ: క్వారీల్లో నిబంధనలు భద్రతా చర్యలు పాటించనందున ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయి. మొన్న గ్రానైట్ క్వారీలో రాయి డ్రిల్లింగ్ చేస్తుండగా జరిగిన ఘోర ప్రమాదాన్ని మరవక ముందే మంగళవారం మెటల్ క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా రాళ్లుపడి వలస కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అందిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం మదలీబదర్ గ్రామానికి చెందిన సాధురామ్ కశ్యప్ (32) మండలంలోని నక్కబొక్కలపాడు గ్రామ సమీపంలోని సనకొండ వెంకటసాయి మెటల్ క్వారీలో పనిచేస్తున్నాడు. మంగళవారం క్వారీ ఎగువ భాగంలో జాకితో రాయి డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైనున్న రాళ్లు కశ్యప్‌పై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. బతుకుదెరువుకు ఇక్కడ మెటల్ క్వారీలో పనిచేస్తున్నాడు. వీఆర్‌ఓ ముసలయ్య ఫిర్యాదుతో బల్లికురవ ఎస్‌ఐ వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.