
డీజిల్ దొంగల అరెస్టు
ఇన్నోవా కారు, 150 లీటర్ల డీజిల్ స్వాధీనం
అద్దంకి రూరల్: రాత్రి సమయంలో పార్కింగ్ చేసిన లారీలు, బస్సుల్లో డీజిల్ దొంగతనం చేస్తున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం అద్దంకి సీఐ సుబ్బరాజు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన బాణావత్ బాలబాదు నాయక్, బాణావత్ తులసీబాబు నాయక్, మోరబోతు శ్రీను నాయక్, రామవత్ దుర్గానాయక్‌లు ఒకే ఊరికి చెందినవారు. వాళ్లంతా ఆయిల్ వాహనాలల్లో దొంగతనాలు చేస్తుంటారు. వీరు ఈనెల 10 వ తేదీన అద్దంకిలోని రామ్‌నగర్ పెట్రోలు బంకు వద్ద పార్కింగ్ చేసిన బస్సు నుంచి ఆయిల్ చోరీ చేశారు. దీనిపై బస్ యజమాని మేరువ శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్సై నరసింహులు, ట్రైనీ ఎస్సై వెంకటేశ్వరరెడ్డి, కానిస్టేబుల్స్ టీమ్‌గా ఏర్పడ్డారు. నలుగురు దొంగలను అద్దంకి సమీపంలోని శింగరకొండ వద్ద కారులో కూర్చున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 150 లీటర్ల డిజిల్, ఇన్నోవా కారును సీఐ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. రెండు నెలల కిత్రం సంతమాగులూరు పరిధిలోని మక్కెనవారిపాలెం పెద్ద కాలువ వద్ద డీజిల్‌ను దొంగతనం చేశారు. వీరిపై గతంలో సంతమాగులూరు, కారంపూడి, బండ్లమోడు, బట్టిప్రోలు పలు కేసులు నమోదయ్యాయి