సంరక్షణ కేంద్రాలున్న ప్రాంతాలు..
జిల్లాలోని సముద్ర తీర గ్రామాలైన చిన్నగంజాం మండలం పరిధిలో ఏటిమొగ్గ, కుంకుడు చెట్టపాలెం, వేటపాలెం మండల పరిధిలో రామచంద్రాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, రామాపురం, బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక తీరాల వద్ద ఒక్కొక్క సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఉన్న సముద్ర తీరంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 145 తల్లి తాబేళ్లు తీరానికి వచ్చి 16,170 గుడ్లు పెట్టి వెళ్లాయి. వీటిని వలంటీర్లు సేకరించి ఆరు సంరక్షణ కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం ఈ గుడ్లు ఇప్పటి వరకు 2358 తాబేళ్ల పిల్లలుగా మారడంతో వాటిని సముద్రంలోకి సురక్షితంగా వదిలేశారు. ఈ ప్రక్రియ మే నెల వరకు కొనసాగుతుంటుంది.


