వేమూరు: ఇసుక రీచ్ కార్మికుల ఆకలి తీరే వరకు తాను పస్తులుండైనా పోరాటం చేస్తానని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. కొల్లూరు మండలంలోని జువ్వలపాలెంలోని ఇసుక రీచ్ కూలీలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. గురువారం ఇసుక రీచ్ వద్దకు ఆయన వెళ్లారు. కూటమి ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తరలిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన రీచ్ కార్మికులకు పని లేకుండా చేసి వారి కుటుంబాలను ఆకలి అలమటింపజేస్తున్నారని పాలకుల తీరుపై మండిపడ్డారు. వారి పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. వారికి తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ట్రాక్టర్లకు, టైరు బండ్లకు ఇసుక లోడ్ చేయకుండా కూటమి నాయకులు అడ్డుకుంటున్నట్లు కూలీలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అటుగా వెళ్లకుండా గండి కొట్టారని చెప్పారు. కొల్లూరు తహసీల్దారును అశోక్‌బాబు కలిసి మాట్లాడటంతో గండి పూడ్చి వేయించారు. కూలీలను ఇసుక లోడింగ్ చేసుకోమని ఆదేశాలిచ్చారు. అశోక్‌బాబు స్వయంగా ట్రాక్టరుపై రీచ్ నుంచి జువ్వలపాలెం వరకు కార్మికులను తీసుకొచ్చారు. కూటమి నాయకులు ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అశోక్‌బాబు మండిపడ్డారు. యంత్రాలతో రాత్రి వేళ వందల లారీలలో ఇసుక నింపి తరలిస్తున్నట్లు ఆరోపించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇసుక రీచ్‌లో పని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. స్టేషన్ లోపలికి కూటమి నాయకులను అనుమతిస్తూ ప్రతిపక్ష నేతలను మాత్రం రోడ్డుపై నిలబెట్టడం దారుణమని పోలీసుల తీరుపై అశోక్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. జువ్వలపాలెం గ్రామానికి చెందిన రైతు ప్రసాద్‌పై దాడి జరగడంతో అడిగేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులను రోడ్డుపై నిలపడం తగదన్నారు. వేమూరు సీఐతోపాటు ఎస్‌ఐ రవికృష్ణ తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సుగున మల్లేశ్వరరావు, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, ఉప సర్పంచ్ శొంఠి కోటేశ్వరరావు, గాజుల శ్రీనివాసరావు, వెలివెల రామకృష్ణ, చిలకా ప్రకాశ్, కూచిపూడి మోషే, మస్తాన్ బాషా, దున్నా మేరీసుబాబు, ఎంపీటీసీ బాబీ, డాక్టర్ డి.గోపి, ధూళ్లపూడి రాంబాబు, కోగంటి కోటేశ్వరరావు, తాడికొండ రాంబాబు, లాజురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు తహసీల్దారుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి


