● న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన ● తట్టుకోలేక తండ్
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
వేమూరు: విద్యుదాఘాతంలో యువకుడు మృతి చెందిన ఘటన మండంలో బేతాళపురంలో శనివారం చోటుచేసుకుంది. తట్టుకోలేక తండ్రి ఆత్యహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అట్లూరు సునీల్(22) అదే గ్రామానికి చెందిన కోగంటి శ్రీకాంత్ పొలంలో మొక్కజొన్న పంటకు ఎరువులు దింపేందుకు వెళ్లాడు. ఎరువుల ట్రాక్టర్‌ను 11 కేవీ లైను కింద పార్క్ చేశారు. సునీల్ కొంత మంది కూలీలతో కలసి ఎరువులను ట్రాక్టర్‌పైకి లోడు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తగలడంతో కింద పడిపోయాడు. అక్కడ పని చేస్తున్న కూలీలు ద్విచక్ర వాహనంపై సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వెళ్తుండగా మధ్యలోనే మృతి చెందాడు.
సునీలు కుటుంబానికి న్యాయం చేయాలి
సునీల్ మృతి చెందినట్లు తెలుసుకున్న బేతాలుపురం గ్రామస్తులు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దారు కార్యాలయం వద్ద రోడ్డుపై బెఠాయించారు. సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని ఽఅందోళన చేశారు. ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతి చెందిన కుటుంబ సభ్యులతో కోగంటి శ్రీకాంత్, విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం
11 కేవీ లైను తీగలు కిందకి వేలాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొలాల్లో విద్యుత్ లైనులు కిందకి వేలాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించు కోవడం లేదని రైతులు ఆరోపించారు.
వేమూరు: బేతాలుపురానికి చెందిన అట్లూరు వెంకయ్య వ్యవసాయం చేస్తుంటాడు. భార్య ముగ్గురు పిల్లలు. కుమారుడు సునీల్ వ్యవసాయ పనుల్లో చేదొడువాదొడుగా ఉంటున్నాడు. కుమారుడికి పెళ్లి చేశాడు. ప్రస్తుతం కోడలు నిండుగర్భిణి. ఎప్పటి లాగే ఈ రోజు సునీల్ పనులకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విషాద వార్త విన్న తండ్రి గుండె తల్లడిల్లిపోయింది. చేతికాడికొచ్చిన బిడ్డను దేవుడు తీసుకెళ్లేపోయాడంటూ రోదిశాడు. భార్యకు ఏవిధంగా సమూదాయించాలని మధనపడ్డాడు. విషాదంలో మునిగిపోయాడు. ఇరుపొరుగు సర్దిచెప్పారు. సాయంత్రానికి తెరుకుంటాడులో అనుకుంటున్న సమయంలో కొడుకు లేని జీవితం ఎందుకని భావించాడు. రైలు కిందపడి తనవుచాలించాడు. శనివారం సాయంత్రం ధర్మపురం వద్ద రేపల్లె నుంచి గుంటూరు రైలు కింద పడి మృతి చెందాడు.
● న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన ● తట్టుకోలేక తండ్
● న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన ● తట్టుకోలేక తండ్


