యోగాతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి
బాపట్ల: యోగాతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఇండియన్ యోగా ఫెడరేషన్, ఏపీ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లెళ్లమూడిఅమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన 44వ జాతీయ యోగాసనాల చాంపియన్ షిప్ పోటీలను జిల్లా కలెక్టర్ శనివారం ప్రారంభించారు. యోగాసనాల పోటీల ప్రారంభ సూచికగా జ్యోతి వెలిగించారు. ఈ చాంపియన్ షిప్ పోటీల సందర్భంగా రూపొందించిన సావనీర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన యోగా మన దేశానిదే కావడం మనకు గర్వకారణం అన్నారు. జాతీయస్థాయి పోటీలకు 16 రాష్ట్రాల నుంచి 617 మంది పాల్గొనడం అభినందనీయం అన్నారు.
కార్యక్రమంలో బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, ఏపీ యోగ అసోసియేషన్ చైర్మన్ వై.హరినాథరెడ్డి, ఇండియా యోగ అసోసియేషన్ చైర్మన్ బిజీ పురోహిత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మృణాల్ చక్రవర్తి, కె.కృష్ణదేవరాయలు, అల్లాడి రవికుమార్, కె.గౌడ, విశ్వజనని పరిషత్ చైర్మన్ దినకర్, రామకృష్ణారావు, బీవీఎస్ లక్ష్మి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


