అక్రమంగా యూరియా కలిగి ఉంటే చర్యలు
వ్యవసాయశాఖ సంచాలకుడు మనజోర్ జిలాని సమూన్
వేమూరు(చుండూరు): నిబంధనలకు విరుద్ధంగా యూరియా కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ హెచ్చరించారు. చుండూరు మండలంలోని వేటపాలెంలో యూరియా సరఫరాపై శనివారం విచారణ చేపట్టారు. గ్రామంలో మొక్కజొన్న పంటలను రైతులతో కలసి పరిశీలించి ముఖాముఖి చర్చించారు. ఆయన మాట్లాడుతూ యూరియా సమస్యపై రియల్ టైమ్ వాస్తవ పరిస్థితులలో నిజనిర్ధారణ, పరిశీలన కోసం క్షేత్ర స్థాయి ధ్రువీకరణ చేపడుతున్నామని చెప్పారు. డీలర్లు, గోడౌన్లు, రైతు సేవా కేంద్రాలు, క్షేత్ర సఆథయిలో యూరియా నిల్వలు ధరలు విక్రయ విధానాలపై ప్రత్యేక్ష పరిశీలన జరిపి, వాస్తవ పరిస్థితులు ఎప్పడికప్పడు నిర్ధారిస్తు రైతులకు పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. రైతులతో వివిధ వ్యవసాయ అంశాలపై మాట్లాడారు. రబీ సీజనలో సాగు చేసే పంట గురించి ఆరా తీయగా ఎక్కువగా మొక్కజొన్న సాగు చేపట్టడం జరిగిందని రైతులు తెలిపారు. వేటపాలెంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అన్నపూర్ణ పాల్గొన్నారు.


