జె.పంగులూరు: మండలంలోని స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గత రెండురోజులుగా ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ ఆద్వర్యంలో జాతీయ మహిళల, పురుషుల జట్ల ఎంపిక జరిగినట్లు రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ జట్ల ఎంపికకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి 100 మంది పురుషులు, 100 మంది మహిళలు వరకు పాల్గొన్నారని తెలిపారు. మొదటి రోజు శనివారం పురుషుల జట్టు ఎంపిక జరగగా, రెండో రోజు ఆదివారం మహిళల జట్టు ఎంపిక జరిగినట్లు తెలిపారు. ఈ ఎంపికలో కోచ్‌లు, మేనేజర్లు, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొని మంచి ప్రతిభా వంతులైన క్రీడాకారులను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 4 వరకు ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జరిగే 57వ సీనియర్ జాతీయస్థాయి ఖోఖో పొటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచుగరటయ్య, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో పంగులూరు గ్రామస్తులు, దాతల సహకారంతో నిర్వహించినట్లు రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతామరామిరెడ్డి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 28 వరకు ఖోఖో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో సాప్ అబ్జర్వర్, జిల్లా కార్యదర్శి బి.కాశీవిశ్వనాథరెడ్డి, అధ్యక్షులు కుర్ర భాస్కరావు, ట్రేజరర్ కె హనుమంతురావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ క్రీడాకారులు పాల్గున్నుట్లు సీతారామిరెడ్డి తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు ఖోఖో జట్ల ఎంపిక