సామాజిక ఆరోగ్య కేంద్రం పునఃప్రారంభం
కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం పునఃప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు
గతంలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం చేసిన మంత్రి మేరుగ నాగార్జున
వేమూరు: చంద్రబాబు సర్కార్‌లో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని పునఃప్రారంభించారు. మండల కేంద్రంలోని 30 పడకల ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మళ్లీ ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయంలో ఈ కేంద్రం నిర్మాణం కోసం నాబార్డు నిధులు రూ. 8.60 కోట్లను మంజూరు చేసింది. 2020 డిసెంబరు 14వ తేదీన 30 పడకల ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 2024 నాటికి భవనాలు పూర్తి అయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన నూతన భవనాన్ని అప్పటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రారంభించారు. నూతన భవనాల్లో వైద్యులు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఈ భవనాలను పునఃప్రారంభించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కమ్యూనిటీ కేంద్రాన్ని మంగళవారం పునఃప్రారంభించారు. 2025 నవంబరు 13వ తేదిన వేమూరు మండలంలోని చదలవాడ గ్రామంలో రెండు ప్రభుత్వ గృహాలు ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం నిర్మాణం చేసిన ఇళ్లు పునఃప్రారంభం చేసి చంద్రబాబు సర్కార్‌లో ఇళ్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభం చేశారు. అదే విధగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం కూడా మళీ జరిగింది.
సామాజిక ఆరోగ్య కేంద్రం పునఃప్రారంభం


