అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్‌కు ఎంపిక
వేటపాలెం: ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో వేటపాలెంకు చెందిన గాత్రం ఉమామహేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులు సత్తాచాటారు. హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో ఈ నెల 6, 7 తేదీల్లో ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 45 ప్లస్ విబాగంలో గాత్రం ఉమామహేశ్వరావు, వెంకటక్ష్మి దంపతులు అద్భుత ప్రతిభ కనపరిచ్చారు. త్రిపుల్ జంప్ 4–100 మీటర్ల రిలే పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. 800 మీటర్ల పరుగు పందెం లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఉమా భార్య వెంకటలక్ష్మి లాంగ్ జంప్, 4–100 మీటర్ల రిలే లో ప్రథమ స్థానం, 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, షార్ట్ పుట్‌లో తృతీయ స్థానం నిలిచింది. ఽథాయిలాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు భార్య, భర్తలు ఎంపికయ్యారు.
సత్తా చాటిన దంపతులు


