కోర్టు కాంప్లెక్స్‌లో సంక్రాంతి సంబరాలు
●సాంప్రదాయ క్రీడలలో న్యాయవాదులు
●రెండు రోజులపాటు పోటీలు
●నేడు రంగవల్లులు సంగీత విభావరి
బాపట్ల బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం నుంచి జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవరణ న్యాయవాదుల సంప్రదాయ క్రీడలతో నేటి తరానికి పాత జ్ఞాపకాలను, అందించేలా సరికొత్త నూతన ఉత్సాహంతో హడావుడి చేశారు. తొలుత క్యారమ్స్, చెస్ పోటీలను కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించారు. అనంతరం మహిళా న్యాయవాదులు, పురుష న్యాయవాదులతో పోటీగా లాంగ్ జంప్, షాట్ పుట్, పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. స్లో సైక్లింగ్, టగ్ ఆఫ్ వార్, బాస్కెట్బాల్, త్రో బాల్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ పోటీలలో పురుష న్యాయవాదులతో పోటీగా మహిళా న్యాయవాదులు పాల్గొని విజేతలుగా నిలిచారు. సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే, పల్లె పండుగ, సంబరాల పండుగ, అలాంటి సంబరాలు అన్ని వృత్తులలో వారికి అవసరం అన్నారు. రోజువారి ఒత్తిడి నుండి బయటపడి, సరికొత్త జీవనయానానికి, సంక్రాంతి సంబరాలు ఎంతో దోహదపడతాయని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే అవినాష్ మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం నుండి హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలు, గోమాతల ఊరేగింపు, రంగవల్లుల పోటీలు, వేద పండితుల ఆశీర్వచనం, సినీ సంగీత విభావరి కార్యక్రమాలతో హోరెత్తిస్తామని, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, న్యాయవాద గుమస్తాలు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. రెండు రోజులుగా జరుగుతున్న ఆటల పోటీలలో విజేతలకు శుక్రవారం సాయంత్రం జరిగే కార్యక్రమాలు బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమాలను న్యాయవాదులు విన్నకోట సత్యప్రసాద్, బి స్టాన్లీ విమల్‌కుమార్, కె రవిబాబు, బెంజ్, శ్యామలాదేవి, టి రాఘవేంద్రనాథ్, కే సురేంద్ర, రామిడి వెంకటేశ్వర్లు, నల్లమోతు సుబ్బారావు, పులిపాక రఘురాం, నంబూరి నరసింహారావు, ఎన్ వీఎస్‌వీ చలపతిరావు, ఎస్‌కేజెడ్ బాషా, రామకోటి, ఇమ్మడిశెట్టి సతీష్, ఎలవల నరేష్, బీమా లీలాకృష్ణ, వుట్ల రామారావు, బండి రామ్మూర్తి, దగ్గుమల్లి కిరణ్, సుబ్రహ్మణ్యం, ఉసిరికాయల శ్రీనివాసరావు, సాయి నాగేశ్వరరావు, యుమ్మడిశెట్టి బాలకృష్ణ, శంకరి, మాధురి, చంద్రిక, దివ్య, హేమంత్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
కోర్టు కాంప్లెక్స్‌లో సంక్రాంతి సంబరాలు


