తీరంలో అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తీరంలో అలర్ట్‌

Published Mon, Dec 4 2023 2:44 AM | Last Updated on Mon, Dec 4 2023 2:44 AM

 రేపల్లె ప్రాంతంలో పంటను కట్టలు కడుతున్న రైతులు  - Sakshi

బాపట్ల
సోమవారం శ్రీ 4 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023
రంగు మారిన సముద్రం

బండ్లమ్మకు పూజలు

చందోలు (పిట్టలవానిపాలెం): చందోలులోని బగళాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అభయ ప్రదాయినిగా అలంకరించి అభిషేకాలు చేశారు.

పోటెత్తిన భక్తులు

మంగళగిరి: పానకాల లక్ష్మీనృసింహస్వామి కొండకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం ఆదివారం కావడంతో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కొండ కిటకిటలాడింది.

10 నుంచి 15 అడుగుల ఎత్తులో అలలు

అప్రమత్తమైన అధికారులు

చినగంజాం/చీరాలటౌన్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాన్‌ కారణంగా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. చినగంజాం సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. మండలంలోని పల్లెపాలెం, పెదగంజాం పల్లెపాలెం, మోటుపల్లి రుద్రమాంబపురం గ్రామాల్లోని సముద్ర తీరంలో ఆదివారం ఉదయం నుంచి అలలు భారీగా రాగా ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సుమారు 10 నుంచి 15 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అలల తీవ్రతకు సముద్రంలోని నీరు రంగుమారింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సురక్షిత ప్రాంతాలకు మత్స్యకారులు

మిచాంగ్‌ తుఫాన్‌ తీరం దాటేంతవరకు వాడరేవు తదితర సముద్రతీర ప్రాంత మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేశామని చీరాల ఆర్డీవో పి.సరోజిని తెలిపారు. మిచాంగ్‌ తుఫాన్‌ నేపథ్యంలో భారీవర్షాలు, ఈదురుగాలులు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం ఆర్డీవో, తహసీల్దార్‌ ప్రభాకరరావు, మైరెన్‌ ఎస్సై సుబ్బారావు, రూరల్‌ ఎస్సై జనార్దన్‌, రెవెన్యూ సిబ్బంది వాడరేవు, రామాపురం, విజయలక్ష్మీపురం, కఠారిపాలెం తీరప్రాంత గ్రామాల్లో పర్యటించారు. వాడరేవులో తహసీల్దార్‌ ప్రభాకర్‌రావు, సీఐ సోమశేఖర్‌ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం సిబ్బందికి సలహాలు, సూచనలు ఏర్పాటు చేశారు.

బాపట్ల అర్బన్‌: వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో బాపట్ల జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆధ్వర్యంలో తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిజాంపట్నం తీర ప్రాంతంలో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. మత్స్య కారులను వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని తీరానికి రావాలని కోరారు.

ఎక్కడికక్కడ అప్రమత్తం

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉండేలా జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్డీవో, తహసీల్దార్ల కార్యాలయాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు మండల కేంద్రాల్లో బృందాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. పౌర సరఫరాల శాఖ అధికారుల నిత్యావసర సరుకులు సిద్ధం చేశారు. జనరేటర్లు, చెట్లు తొలగించే యంత్రాలు సిద్ధంగా ఉంచారు. రహదారులు దెబ్బతినే అవకాశం ఉన్నందున మరమ్మత్తులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యుత్‌, పారిశుధ్య విభాగాల అధికారులు 24 గంటలు విధుల్లో ఉండేలా కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లోనే ఉండనున్నారు.

కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవాలి

తుపాను హెచ్చరికల నేపథ్యంలో కోతకు వచ్చిన పంటలను కాపాడుకునేందుక రైతులను ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఒక వేళ పంట పొలాల్లో నీళ్లు చేరితే వీటిని త్వరగా బయటికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

నేటి స్పందన రద్దు

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ రంజిత్‌బాషా ఉత్తర్వులు ఇచ్చారు.

నేడు పోలీసు స్పందన రద్దు

బాపట్లటౌన్‌: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం మిచాంగ్‌ తుఫాన్‌ కారణంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జిల్లా కేంద్రానికి ఎవ్వరూ రావద్దని కోరారు.

9

న్యూస్‌రీల్‌

సురక్షిత ప్రాంతాలకు తరలింపు

బాపట్ల తీర ప్రాంతంలోని తుఫాన్‌ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను అడవి పంచాయతీలో తుఫాన్‌ షెల్టర్‌లో 50 మంది, అడవిపల్లెపాలెం ఏఎంజీ పాఠశాలలో 100 మంది, కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం ఎంపీయూపీ పాఠశాలల్లో 60 మంది, తుమ్మలపల్లి భవనంలో 80 మంది కలిపి మొత్తం 290 మందిని ఉంచారు. నిజాంపట్నం తీర ప్రాంత ప్రజలను రేపల్లె మండలంలోని లంకెవానిదిబ్బ తుఫాన్‌ షెల్టరులో 95 మందిని, లక్ష్మీపురం తుఫాన్‌ షెల్టరులో 70 మంది, మూండ్లగుంట 110 మంది, నిజాంపట్నం మండలంలోని సంజీవనగర్‌ 35 మంది, నక్షత్రనగర్‌ 22 మంది, నిజాంపట్నం హార్బరులో 40 మంది, కొత్తపాలెంలో 20 మంది మొత్తం ఎనిమిది షెల్టర్లలో 412 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆర్డీఓ గంధం రవీందర్‌ తెలిపారు.

మచిలీపట్నం–బాపట్ల మధ్య

తీరం దాటనున్న తుఫాన్‌

భారీ నుంచి అతి భారీ వర్షాలు

కురిసే అవకాశం

బాపట్ల జిల్లాలో నేటి స్పందన రద్దు

నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

నేడు, రేపు పాఠశాలలకు సెలవు

జిల్లా వ్యాప్తంగా తుఫాన్‌ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించడంతో సోమ, మంగళవారాలు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చినగంజాం పల్లెపాలెం సముద్ర తీరంలో ఎగసి పడుతున్న అలలు
1/9

చినగంజాం పల్లెపాలెం సముద్ర తీరంలో ఎగసి పడుతున్న అలలు

2/9

భట్టిప్రోలులో హార్వెస్టర్‌ ద్వారా కోసిన పంటను ట్రాక్టర్‌లో నింపుతున్న దృశ్యం
3/9

భట్టిప్రోలులో హార్వెస్టర్‌ ద్వారా కోసిన పంటను ట్రాక్టర్‌లో నింపుతున్న దృశ్యం

భట్టిప్రోలు–తెనాలి రహదారి పక్కన 
పంట దిగుబడులను పట్టాతో కప్పిన దృశ్యం
4/9

భట్టిప్రోలు–తెనాలి రహదారి పక్కన పంట దిగుబడులను పట్టాతో కప్పిన దృశ్యం

5/9

6/9

వాడరేవులో సిబ్బందికి సూచనలు ఇస్తున్న పోలీసు అధికారులు
7/9

వాడరేవులో సిబ్బందికి సూచనలు ఇస్తున్న పోలీసు అధికారులు

8/9

9/9

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement