
శోభా యాత్రలో పాల్గొన్న ఎస్‌ఎస్‌ఎఫ్ నిర్వాహకులు, సభ్యులు
భట్టిప్రోలు: మన ధర్మాన్ని ఆచరించి కాపాడాలని శ్రీ సత్యజ్ఞాన ఆశ్రమం నిర్వాహకులు ప్రణవానంద భారతి స్వామి అన్నారు. సమరసతా ఫౌండేషన్(ఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం భట్టిప్రోలు వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణలోని సాయికృష్ణ కళావేదిక ఆవరణలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం విశ్వజనీయమై, ప్రపంచ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. ఎస్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రముఖ్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వాడల్లో టీటీడీ ఆర్థిక సహాయంతో 820 దేవాలయాలు నిర్మించి 14 పర్యాయాలు రాష్ట్రంలో ఇంటింటా ధర్మ ప్రచారాలు, సమ్మేళనాలు, శోభాయాత్రలు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా భజన సంకీర్తనలు, శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి మండల కన్వీనర్ వేల్పూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బి.విజయలక్ష్మి, వై.శివనాగమల్లేశ్వరి, బి.అరుణకుమారి, కె.రవికుమార్, పి.వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వరరావు, వి.శివగోపి, పి.కోటేశ్వరరావు, శొంఠి బాబూరావు, బి.శ్రీనివాసరావు, హేమశంకరరావు, మురళీకృష్ణ పాల్గొన్నారు.
ప్రణవానంద భారతి స్వామి భట్టిప్రోలులో హిందూ సమ్మేళన సభ