మేషం
పాత బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. అనుకోని ధనవ్యయం. శ్రమాధిక్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం
అనుకున్న వ్యవహారాలలో విజయం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఒత్తిడుల నుంచి బయటపడతారు. కొన్ని సమస్యలు, వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు పుంజుకుని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలీకతమవుతాయి. వారం ప్రారంభంలో ఆప్తులతో విభేదాలు.. వ్యయప్రయాసలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, దుర్గాదేవిని పూజించండి.
మిథునం
ఆర్థిక వ్యవహారాలు మొదట్లో నిరాశపర్చినా క్రమేపీ అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటకం
కొన్ని సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. భూములు, వాహనాల కొనుగోలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు . గణేశాష్టకం పఠించండి.
సింహం
అనుకున్న పనుల్లో అవాంతరాలు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, దేవీఖడ్గమాల పఠించండి.
కన్య
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఊహించని ఆహ్వానాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కివస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. శివపంచాక్షరి పఠించండి.
తుల
పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మీ శ్రమ ఫలించి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. గులాబీ, ఎరుపు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత ఊరట. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు
కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నీలం, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.
మకరం
కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థుల ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు.ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.. కళారంగం వారికి ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. మిత్రులతో విభేదాలు. తెలుపు, గులాబీ రంగులు, గణపతి అర్చన చేయండి.
కుంభం
కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు. సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట లభిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
మీనం
శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనులలో అవరోధాలు ఎదురైనా అధిగమించి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు అవకాశాలు అవ్రయత్నంగా దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో మానసిక ఆందోళన. గులాబీ, లేత నీలం రంగులు, దేవీస్తుతి చేయండి.


