ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 13-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Aug 13 2026 3:02 AM | Updated on Aug 13 2026 3:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 13-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు. పాడ్యమి రా.9.55 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఆశ్లేష ఉ.7.48 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.7.21 నుండి 8.53 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.58 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.01 నుండి 3.52 వరకు, అమృత ఘడియలు: ఉ.6.16 నుండి 7.46 వరకు.

సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.25
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం.. పనుల్లో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృషభం... పరిస్థితులు అంతగా కలిసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని వివాదాలు.

మిథునం... కొత్త వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవం దక్కుతుంది. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరణ అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం... శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం.... సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య... రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా మారవచ్చు.

తుల.... కొత్త పనులు చేపడతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూలత.

వృశ్చికం..... ఆస్తిలాభం. సోదరులతో విభేదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు పరిష్కారం.

ధనుస్సు...... పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం.. వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. భూవివాదాల పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పరపతి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం... అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement