ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. స్థిరాస్తివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 10-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. స్థిరాస్తివృద్ధి

Aug 10 2026 3:01 AM | Updated on Aug 10 2026 3:01 AM

Rasi Phalalu: Daily Horoscope On 10-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.6.20 వరకు, తదుపరి త్రయోదశి రా.3.59 వరకు, నక్షత్రం: ఆరుద్ర ప.12.01 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.11.13 నుండి 12.43 వరకు, దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.21 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.53 వరకు, అమృత ఘడియలు: లేవు.

సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం... నూతన వ్యక్తుల పరిచయం. ఆస్తుల విక్రయాలు లాభిస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. కొన్ని అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం... కొన్ని పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో స్వల్ప విభేదాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మిథునం.... పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి ఉపశమనం.

కర్కాటకం... సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం.... కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య.... కొన్ని సమస్యలు తీరి ఒడ్డున పడతారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

తుల.... రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. సోదరులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం... శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఎదురుకావచ్చు.

ధనుస్సు... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం... చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

కుంభం.... పనులలో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం.  ఒప్పందాలలో జాప్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాల విస్తరణయత్నాలు వాయిదా. ఉద్యోగాలలో మార్పులు.

మీనం... సన్నిహితులతో మాటపట్టింపులు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. కాంట్రాక్టుల యత్నాలు ఫలించవు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement