ఈ రాశి వారు భూములు కొంటారు | Today Telugu Horoscope On August 9th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు కొంటారు

Aug 9 2026 2:11 AM | Updated on Aug 9 2026 12:06 PM

Rasi Phalalu: Daily Horoscope On 09-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.8.48 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: మృగశిర ప.1.42 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.36 వరకు, అమృత ఘడియలు: రా.2.43 నుండి 3.55 వరకు, మతత్రయ ఏకాదశి.

సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం.. మిత్రుల నుంచి శుభవార్తలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.  సమాజంలో ప్రత్యేక గౌరవం. భూములు కొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం... రుణ దాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. దైవచింతన. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

మిథునం.... సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. పనుల్లో పురోభివృద్ధి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

కర్కాటకం.... పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.  వ్యయప్రయాసలు. బం«ధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం.... కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో సమస్యలు తీరతాయి. బం«ధువులతో తగాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్య..... కొత్త మిత్రుల పరిచయం. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. వ్యవహారాలు సకాలంలో సరిదిద్దుతారు. ప్రముఖుల కలయిక. వ్యాపారాలు,ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

తుల..... ఏ ప్రయత్నమైనా నిదానంగా సాగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం... ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు..... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

మకరం.... ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతోషకరంగా గడుపుతారు.

కుంభం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఒప్పందాలు వాయిదా. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికలిగిస్తాయి.

మీనం..... పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement