ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. గృహయోగం | Rasi Phalalu: Daily Horoscope On 07-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. గృహయోగం

Aug 7 2026 3:10 AM | Updated on Aug 7 2026 3:10 AM

Rasi Phalalu: Daily Horoscope On 07-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.నవమి ప.1.36 వరకు, తదుపరి దశమి,నక్షత్రం: కృత్తిక సా.4.55 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.06 వరకు, తదుపరి  ప.12.31 నుండి 1.22 వరకు, అమృత ఘడియలు: ప.2.36 నుండి 4.07 వరకు.

సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.28
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం.. సన్నిహితులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృషభం.... వ్యవహారాలు విజయవంతమవుతాయి. ఆర్థిక ప్రగతి. నూతన వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మిథునం.... రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. శ్రమపడినా ఫలితం కనిపించదు. విద్యార్థుల కృషి ఫలించదు. ఆస్తుల వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదన పు బాధ్యతలు.

కర్కాటకం... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు.

సింహం... పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వృద్ధి. గృహయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కన్య.... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

తుల.... కొత్త రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

వృశ్చికం... ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. వస్తు,వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.

ధనుస్సు.... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. భూలాభాలు. తీర్థయాత్రలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో హోదాలు రావచ్చు.

మకరం..... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

కుంభం... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం... కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో పురోగతి. దూరపు బంధువుల కలయిక. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement