ఈ రాశి వారికి ఆస్తి యోగం.. వస్తులాభం | Rasi Phalalu: Daily Horoscope On 08-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తి యోగం.. వస్తులాభం

Aug 8 2026 12:03 AM | Updated on Aug 8 2026 12:03 AM

Rasi Phalalu: Daily Horoscope On 08-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.దశమి ఉ.11.16 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: రోహిణి ప.3.22 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ఉ.7.50 నుండి 9.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.24 వరకు, అమృత ఘడియలు: ప.12.21 నుండి 1.52 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం     :  6.28
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: సన్నిహితులు, సోదరులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

మిథునం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పవు.

కర్కాటకం: పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

సింహ: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడతారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.

కన్య: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ప్రయాణాలు విరమిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు ఉంటాయి. ఉద్యోగాలలో  ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడులు.

తుల: మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో పనిభారం.

వృశ్చికం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పనుల్లో విజయం. ఆలోచనలు అమలు చేస్తారు. భూలాభాలు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: చిరకాల మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సకాలంలో చక్కదిద్దుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement