ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారవృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 12-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారవృద్ధి

Aug 12 2026 3:07 AM | Updated on Aug 12 2026 3:07 AM

Rasi Phalalu: Daily Horoscope On 12-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: అమావాస్య రా.11.41 వరకు, తదుపరి శ్రావణ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: పుష్యమి ఉ.9.00 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.09 నుండి 10.41 వరకు, దుర్ముహూర్తం: ప.11.39 నుండి 12.30 వరకు, అమృత ఘడియలు: లేవు, గురుమూఢమి సమాప్తం.

సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.25
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం.... వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం.. కీలక సమాచారం.. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మిథునం.... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు.  అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కర్కాటకం.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం.... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య... నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల..... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

వృశ్చికం.... ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు...... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం.... సోదరులతో సఖ్యత. కార్యజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం..... రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement