ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 16-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Aug 16 2026 3:55 AM | Updated on Aug 16 2026 5:20 AM

Rasi Phalalu: Daily Horoscope On 16-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.చవితి రా.7.01 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఉత్తర ఉ.6.23 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ప.2.54 నుండి 4.33 వరకు, దుర్ముహూర్తం: సా.4.42 నుండి 5.32 వరకు, అమృత ఘడియలు: రా.12.40
నుండి 2.18 వరకు, నాగచతుర్ధి.

సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.23
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం.. వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి. ఆకస్మిక ధనలాభం. ప్రయాణాలు సంభవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం.... పనులలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం.... బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కర్కాటకం... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవచింతన. సోదరులతో సఖ్యత. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

సింహం...... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య...... కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి కొనుగోలు యత్నాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల.... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా కలిసిరాదు. బంధువులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం... నూతన ఉద్యోగప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు.... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం... చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం... నిర్ణయాలలో తొందరవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మీనం.... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement