గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.విదియ రా.8.31 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: మఖ ఉ.6.55 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.2.45 నుండి 4.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.08 వరకు తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: రా.12.10 నుండి 1.42 వరకు.
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.24
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం..... శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
వృషభం.... దూరప్రయాణాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.
మిథునం... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు.
కర్కాటకం....... కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
సింహం... శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అదనపు రాబడి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.
కన్య..... మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
తుల..... ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం...... కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
ధనుస్సు... ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
మకరం... అనుకున్న పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో స్వల్ప వివాదాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.
కుంభం... దూరపు బంధువులు సహాయపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం.. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలోఅంచనాలు నిజమవుతాయి.


