ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 15-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Aug 15 2026 1:50 AM | Updated on Aug 15 2026 1:50 AM

Rasi Phalalu: Daily Horoscope On 15-08-2026 In Telugu

   గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.తదియ రా.7.31 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పుబ్బ ఉ.6.25 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ప.1.36 నుండి 3.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.46 నుండి 7.26 వరకు, అమృత ఘడియలు: రా.12.10 నుండి 1.44 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం     :  6.24
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.

వృషభం: కుటుంబంలో కొన్ని సమస్యలు తప్పవు. అనారోగ్యం. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: నూతన ఉద్యోగాలు లాభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

కర్కాటకం: వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

సింహం: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య: రుణదాతల ఒత్తిడులు. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు.  విద్యార్థులకు కార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త వ్యక్తుల పరిచయం. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

ధనుస్సు:  మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement