ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Today Horoscope 11 11 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.తదియ సా.6.21 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: మృగశిర పూర్తి (24గంటలు), వర్జ్యం: ఉ.10.33 నుండి 12.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.07 నుండి 12.52 వరకు, అమృతఘడియలు: రా.8.54 నుండి 10.38 వరకు; రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు; సూర్యోదయం 6.06; సూర్యాస్తమయం 5.22. 

మేషం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం: వ్యయప్రయాసలు. పనులలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి..

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: రుణయత్నాలు. పనులలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఇంటిలో శుభకార్యాలు. ధన, వస్తులాభాలు.  సంఘంలో గౌరవం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత..

కన్య: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి.  ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: మిత్రులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు.  శ్రమాధికం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

మీనం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top