గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.షష్ఠి ప.12.24 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: రోహిణి ఉ.7.30 వరకు, తదుపరి మృగశిర తె.5.50 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం: ప.12.43 నుండి 2.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.14 నుండి 1.01 వరకు, అమృత ఘడియలు: రా.9.39 నుండి 11.06 వరకు.
సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.48
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం.... శ్రమానంతరం పనులు పూర్తి. మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
వృషభం.... శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులు, సోదరీలతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు.
మిథునం.... ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం.... ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం..... దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.
కన్య..... మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
తుల.... ఆదాయానికి మించి ఖర్చులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
వృశ్చికం.... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
ధనుస్సు... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
మకరం... ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కుంభం.... మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
మీనం.... చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.


