గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.తదియ సా.6.34 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: అశ్వని ఉ.11.19 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ఉ.7.24 నుండి 8.59 వరకు, తిరిగి రా.8.30 నుండి 10.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.40 నుండి 11.26 వరకు, అమృత ఘడియలు: తె.5.40 నుండి 7.11 వరకు, ఉండ్రాళ్ల తదియ, సంకటహర చతుర్థి.
సూర్యోదయం : 5.53
సూర్యాస్తమయం : 5.50
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం.... పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. విద్యార్థులకు నూతనోత్సాహం. కొన్ని వివాదాల పరిష్కారం.
వృషభం.. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ప్రతిష్ఠంభన. అనారోగ్యం. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. దైవదర్శనాలు..
మిథునం... చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. తీర్థయాత్రలు. విందువినోదాలు.సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి..
కర్కాటకం.... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి,వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు సాయం అందిస్తారు.
సింహం..... కుటుంబసభ్యులతో కొన్ని వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు.
కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. వృత్తి, వ్యాపారాలు భారంగా మారతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు.
కన్య... వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో వైరం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి. కొద్దిపాటి ఆరోగ్య, కుటుంబసమస్యలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం.
తుల..... విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
వృశ్చికం... నూతన వరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి.
ధనుస్సు..... బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో కొద్దిపాటి ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఆలయ దర్శనాలు. శ్రమ మరింత పెరుగుతుంది.
మకరం.. పనుల్లో స్వల్ప అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత ఒత్తిడులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. స్వల్ప ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం.
కుంభం....... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు
మీనం.... కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆస్తి వివాదాలతో కొంత ఇబ్బందిపడతారు. దైవచింతన .


