ఈ రాశి వారికి ఆస్తిలాభ సూచనలు.. వ్యాపారవృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 27-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తిలాభ సూచనలు.. వ్యాపారవృద్ధి

Sep 27 2026 3:02 AM | Updated on Sep 27 2026 3:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.పాడ్యమి రా.9.11 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.12.14 వరకు తదుపరి రేవతి, వర్జ్యం: రా.12.05 నుండి 1.40 వరకు, దుర్ముహూర్తం: సా.4.15 నుండి 5.03 వరకు, అమృత ఘడియలు: ఉ.7.23 నుండి 9.01 వరకు, మహాలయ పక్షం ప్రారంభం.

సూర్యోదయం : 5.53
సూర్యాస్తమయం : 5.50
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... కొత్తగా రుణాలు చేస్తారు. పనులలో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్యం.

వృషభం... కార్యజయం. విందువినోదాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. ఆలయ దర్శనాలు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం.... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో సఖ్యత. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం.

కర్కాటకం.... శ్రమపడ్డా ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.

సింహం... అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు కొంతమేర ఫలిస్తాయి.

కన్య..... ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన విద్యావకాశాలు.

తుల.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులకు సత్కారాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

వృశ్చికం... ముఖ్య  వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు.... ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు. నిరుద్యోగులు మరింత శ్రమపడాలి.

మకరం..... పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

కుంభం.... ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మీనం.... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆలయాల దర్శనాలు. ధనలబ్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement