గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.ఏకాదశి రా.7.39 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.6.31 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.10.51 నుండి 12.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.42 నుండి 11.30 వరకు, అమృత ఘడియలు: రా.9.15 నుండి 11.01 వరకు, సర్వ ఏకాదశి.
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.56
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... కొత్త విషయాలు గ్రహిస్తారు. పోటీపరీక్షల్లో విజయం. ఆస్తుల కొనుగోలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృషభం.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం..... మిత్రుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో అవాంతరాలు. మానసిక అశాంతి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.
కర్కాటకం..... సోదరులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం..... శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కన్య..... పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
తుల... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తుంది.
వృశ్చికం...... పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
ధనుస్సు..... రాబడి అంతగా అనుకూలించదు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం..... పనుల్లో విజయం. ఆస్తులు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కుంభం.... కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
మీనం..... విద్యార్థులకు నూతన అవకాశాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.


