ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 23-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

Sep 23 2026 3:07 AM | Updated on Sep 23 2026 3:07 AM

Rasi Phalalu: Daily Horoscope On 23-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.ద్వాదశి రా.8.55 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: శ్రవణం ఉ.8.34 వరకు తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.12.50 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.17 వరకు, అమృత ఘడియలు: రా.11.05 నుండి 12.47 వరకు.

సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.56
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం... ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి.

వృషభం..... శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం... ఆస్తుల విషయంలో చికాకులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం.... కుటుంబసభ్యులతో సఖ్యత.. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. చర్చలు సఫలం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం.... కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య.... సోదరుల నుంచి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

తుల...... వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృశ్చికం..... సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. స్వల్ప ధనలబ్ధి. వ్యవహారాలలో క్రియాశీలపాత్ర పోషిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు...... కార్యక్రమాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం...... పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తులు కొంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం... పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి. ఆలయ దర్శనాలు.

మీనం.... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు నుంచి గట్టెక్కుతారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement